రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజనసభ

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద సొసైటీలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు సహకరించాలని సోసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ రైతులను కోరారు. సోమవారం బిచ్కుంద  వ్యవసాయ సహకార సంఘం భవనంలో సొసైటీ చైర్మన్ నల్చర్ బాలాజీ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో సొసైటీ లావాదేవీలను రైతులకు చదివి వినిపించారు. 2025 సంవత్సరం సంబంధించి ఆరు మాసాల జమ ఖర్చుల పట్టికలను ఆమోదించారు. గత సంవత్సర ఆడిట్ అయిన అంశములను పరిశీలించి ఆమోదించారు. అనంతరం రైతుల కోరిక...