29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందల్వాయి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో గాఢ నిద్ర

Must read

📰 Generate e-Paper Clip

 ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తపాల శాఖ సబ్ పోస్ట్ (పోస్ట్ ఆఫీస్) కార్యాలయంలో సబ్ పోస్ట్  ఆఫీస్ సిబ్బంది దర్జాగా తపాలా శాఖ కార్యాలయంలో గాఢనిద్రలో నిద్రిస్తూ ఉండడం గమనార్హం. తపాల శాఖ కార్యాలయంలో ఘాడమైన నిద్రలో గురుక శబ్దాలతో కునుకు  తీయడమేంటని విలేకరులు అడిగినప్పుడు నీవు ఎవరు అసలు  నీకు విలేకరి ఐడి కార్డు ఉందా నా డ్యూటీ అయిపోయింది నేను నిద్రిస్తాను నీవు ఎవరు నన్ను అడగడానికి అంటూ బదులిచ్చారు. పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఇలాగే నిద్రిస్తే ప్రజలకు సేవలు ఎలా అందిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సిబ్బంది మేనేజరు స్పందించి కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈమధ్య మామిడిపల్లి పోస్ట్ ఆఫీస్ వ్యక్తి వద్ద పెన్షన్ ఇచ్చే 8 లక్షల రూపాయలు దొంగలించిన సమాచారం మరువకముందే ఇలా ఇందల్వాయి హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో పెన్షన్ ఇచ్చే రోజుల్లో ఇలా నిద్రపోవడం ఎంతవరకు కరెక్ట్ అని తపాలా సేవా లు అందుకునే కస్టమర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇకనైనా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది నిద్రమత్తును వీడి ప్రజలకు సేవ చేసే పనిలో ఉండాలని అధికారులు అప్రమత్తమై కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి తగు సలహా సూచనలు ఇవ్వాలని కోరుకుందాం.

Deep sleep at Indalwai Head Post Office

More articles

Latest article