28.2 C
Hyderabad

బిగ్ బాస్ ఫేమ్ నటి వర్షిణి అరెస్టు

Bigg Boss fame actress Varshini arrested.

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

ఓ యువకుడిని బెదిరించి డబ్బులు దోచుకున్న కేసులో బిగ్ బాస్ ఫేమ్, నటి వర్షిణిని పోలీసులు అరెస్టు చేశారు. షార్ట్ ఫిలిం తీయాలన్న పేరుతో పిలిపించి పెట్టుబడి పెట్టాలని వర్షిణి కోరింది. ఆ తర్వాత తను మోసపోయానని తెలుసుకొని డబ్బులు తిరిగి ఇచ్చెయ్యామని అడిగానని, గత నెల 22న ఇంటికి రమ్మని పిలిచి దాడి చేసి తన దగ్గర ఉన్న రెండు సెల్ ఫోన్లు, 50 వేల రూపాయలు నగదు కూడా తీసుకుందని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసి తన దగ్గర చాలా మెటీరియల్ ఉందని ఐదు లక్షలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతావని చెప్పి మళ్ళీ ఐదు లక్షలు తీసుకొని మోసం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఆమెపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు.

More articles

Latest article