నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రహదారి రాకపోకలు రోజురోజుకీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బస్ స్టేషన్ పరిసరాల్లో తరచుగా ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు చోటుచేసుకోవడం సాధారణమైపోయింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అధికారులు ముందుకు వచ్చారు. సోమవారం నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. డిపో-1 మేనేజర్ బి.యస్.ఆనంద్, బస్ స్టేషన్ పరిసరాల్లోని ట్రాఫిక్ సమస్యలు, నగరంలోని ప్రమాదకర ప్రాంతాల పరిస్థితిని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ నుంచి సహకారం అందించాలని కోరారు. బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగితే, రాకపోకలు సులభమవుతాయని, ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. . ఈ సందర్భంగా కమిషనర్ ఆర్టీసీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మహిపాల్, ప్రభుదాస్ పాల్గొన్నారు.
