బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని సీపీకి వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రహదారి రాకపోకలు రోజురోజుకీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బస్ స్టేషన్ పరిసరాల్లో తరచుగా ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు చోటుచేసుకోవడం సాధారణమైపోయింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అధికారులు ముందుకు వచ్చారు. సోమవారం నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. డిపో-1 మేనేజర్ బి.యస్.ఆనంద్, బస్ స్టేషన్ పరిసరాల్లోని ట్రాఫిక్ సమస్యలు, నగరంలోని ప్రమాదకర ప్రాంతాల పరిస్థితిని వివరించారు. ఈ...