26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను

Must read

📰 Generate e-Paper Clip

  • కోట్ల విలువ గల భూమి  కొట్టేసేందుకు ప్లాన్
  • అధికారుల అండదండలతో  గ్రామస్తులకు బెదిరింపులు
  • గతంలో జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు

The eyes of the elders on government lands

బతుకమ్మ, కోటగిరి :  ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పెద్దల కన్ను పడి ఆ భూమి కబ్జా అయిపోతుంది. అని మరో సారి రుజువైంది.  ఇటీవల కాలంలో కొత్త మండలాల ఏర్పాటు లో భాగంగా  పోతంగల్ ను కొత్తగా ఏర్పాటు చేశాగా అదే అదునుగా తీసుకున్న  కొందరు భూ బకాసురులు ప్రభుత్వ. భూమి పై కన్నేశారు. గ్రామంలో పేరున్న వ్యక్తులుగా  చలామణి అవుతున్న కొందరు  పోతంగల్ నుండి కోటగిరి వెళ్లే ప్రధాన  రహదారికి అనుకోని ఉన్న ప్రభుత్వనికి సంబందించిన  171,172 సర్వే నెంబర్ గల భూమి ప్రక్కనే   ప్లాన్ ప్రకారమే కొంత భూమి కొనుగోలు చేసి  ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు.  గతంలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వగా మరికొంత భూమి మిగిలిపోవడంతో  ఇటీవల కాలంలో కొందరు పేదలు ఇండ్ల స్థలం కోసం ప్రభుత్వ భూమిలో  షెడ్లను నిర్మించుకోగా  బడా బాబులు  అధికారుల అండదండలతో బెదిరింపులు పాల్పడుతున్నారని  గ్రామస్తులు రోడ్డు పై బైఠాయించి  తహసీల్దార్ కార్యాలయం లో సైతం పిర్యాదు చేశారు.

The eyes of the elders on government lands

  • గతంలో 58,59 జిఓల తో  ప్రభుత్వ భూమికి పంగనామం..   

58,59 జిఓల ప్రకారం  ప్రభుత్వ స్థలాలలో  ఆశ్రయం ఏర్పాటు చేసుకొని  జీవిస్తున్న వారికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం  పట్టాలను ఇస్తుండగా  , పోతంగల్  గ్రామంలో మాత్రం కొందరు  ప్రవేట్ వ్యక్తులు ఇదే అదునుగా తీసుకోని కోట్లు రూపాయలు విలువ చేసే  భూమిని కొట్టేయాలని  చూశారు.  అప్పటి  ఆర్డీఓ రాజేశ్వర్ ఆధ్వర్యంలో  ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం  ప్రభుత్వ భూమిలా  సర్వే చేసి , అనంతరం  58,59 జిఓల  ప్రకారం అప్లికేషన్ పెట్టుకున్న వారికీ సంబందించిన  భూముల సర్వే పేర్లతో  సర్వే నిర్వహించారు,,అయితే అదే అదునుగా తీసుకున్న కొందరు బడాబాబులు పోతంగల్  గ్రామంలో  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారిలో కోట్ల రూపాయలు  విలువ చేసే 171 సర్వే నెంబర్ 34 గుంటలు భూమిని  కామర్షల్  పర్పస్   ప్రవేట్ స్కూల్ ఏర్పాటు చేస్కుంటామని చెప్పి సుమారు 34 గుంటలు ప్రభుత్వ భూమి  ఆక్రమించి స్కూల్ను ఏర్పాటు చేసి తరువాత  కాలంలో స్కూల్ ను తొలగించారు , అయితే కోట్ల విలువ చేసే  భూమి  తమ  వశం  చేసుకోవడం  కోసం58, 59 జిఓ లను  అడ్డుపెట్టుకొని బస్టాండ్ సమీపంలో  ఉన్న కోట్ల రూపాయల  విలువ గల  భూమి  కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 58,59 జిఓల ప్రకారం ఆశ్రయం  లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో నివాసం  ఏర్పాటు చేసుకున్న వారికీ ఈ  జిఓల ప్రకారం డిడి లు చెల్లిస్తే తహసీల్దార్, ఆర్డీఓ సమక్షంలో 90 రోజులలో రెగ్యులైజేషన్ చెసి పట్టాలను  జారీ చేస్తారు, అయితే పోతంగల్  గ్రామంలో 171 సర్వే నెంబర్ గల  ప్రభుత్వ భూమిని  నిరుపేదలు  కాకుండా కొందరు  రాజకీయ  నాయకులు,బడాబాబులు  కలిసి కబ్జా చెసి 58,59 జిఓల  ప్రకారం డిడిలు చెల్లించి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తమ వశం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు.

The eyes of the elders on government lands

  • గతంలో ప్రజవాణిలో ఫిర్యాదు..

పోతంగల్ మండల కేంద్రంలో  ప్రభుత్వ కబ్జా గురుతున్నాయియని పోతంగల్ మండల కేంద్రానికి చెందిన యువత మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు వినతిపత్రలు అందించి చేసి అనంతరం  ప్రజావాణి లో అప్పటి కలెక్టర్ నారాయణ రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు.

The eyes of the elders on government lands

More articles

Latest article