28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బ్యాంక్ మేనేజర్ కుర్చీలో సొసైటీ వైస్ చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

  • కూర్చోవద్ధని వారించిన ఆటెండర్ పై వైస్ చైర్మన్ ఆగ్రహం
  • పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
  • కేస్ విత్ డ్రా చేసుకోవాలని లేకపోతే దూరం బదిలీ చేస్తామని బెదిరింపులు
  • సిరికొండ కో ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ లో ఘటన

 

నిజామాబాద్, బతుకమ్మ : సహకార బ్యాంకులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( సొసైటీ)లకు సంబంధం రుణ సంబంధం. రైతులకు రుణాలు ఇవ్వడం, వాటి రికవరి విషయంలో మాత్రమే రెండు శాఖల మధ్య సత్ససంబంధాలు. అంతకు మించి ఇరువురు వ్యవహారాలలో జోక్యం ఉండందు. సొసైటీల పాలకవర్గం (డైరెక్టర్) లు ఎన్నికల ద్వార ఎంపిక చేయబడితే, బ్యాంకులో ఉద్యోగులు చదువుతో పాటు రాత పరీక్షల ద్వార ఎంపిక చేయబడుతారు. కానీ అలాంటి శాఖల మధ్య జిల్లాలో ఓ సొసైటీ వైస్ చైర్మెన్ ఏకంగా బ్యాంక్ మేనేజర్ కుర్చీలో కూర్చుని హంగామా చేశారు. అది తప్పని వారించడానికి యత్నించిన అటెండర్ పై సొసైటీ వైస్ చైర్మెన్ నోరు పారేసుకున్నారు. తనను అకారణంగా దూషించిన సొసైటీ చైర్మెన్ పై చర్యలు తీసుకోవాలని సదరు బ్యాంకు నాల్గవ తరగతి ఉద్యోగి పోలీస్ స్టేషన్ మెట్లక్కడంతో విషయం వెలుగు లోకి వచ్చింది.

ఈ నెల 17న నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ జిల్లా కేంద్రంలో అధికారులను కలిసేందుకుకు వెళ్లాడు. బ్యాంకు బ్రాంచ్ కు మండలంలోని (పిఎసిఎస్) సొసైటీ వైస్ చైర్మెన్ మేనేజర్ ను కలిసేందుకు వచ్చాడు. అక్కడ మేనేజర్ లేకపోవడంతో ఏకంగా ఆయన కుర్చీలో కూర్చున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్నఅటెండర్ సార్.. అక్కడ కుర్చోవద్ధు.. మేనేజర్ సార్ కు తెలిస్తే తమపై కోప్పడుతారు అని వారించారు. దానితో రెచ్చిపోయిన వైస్ చైర్మెన్ అటెండర్ పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తన విధి నిర్వహణలో జరుగుతున్న తప్పును ఎత్తి చూపినందుకు చిరుద్యోగిపై నోరు పారేసుకున్నారు. తాను సొసైటీకి వైస్ చైర్మెన్ ను అని నీవు నాకు చేప్పేటంతా వారా అని ఆగ్రహంతో ఊగిపోయారు. దానితో ఆ చిరుద్యోగి స్థానిక సిరికొండ పోలీస్ స్టేషన్ లో సొసైటీ వైస్ చైర్మెన్ పై ఫిర్యాదు చేశారు. దానితో నాల్గవ తరగతి ఉద్యోగిపై పోలిటికల్ లీడర్లు ఫైర్ అయ్యారు. కేసు వాపస్ తీసుకోకపోతే దూర ప్రాంతానికి బదిలీ చేస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది.

ఇటీవల కాలంలో బ్యాంక్ ఉద్యోగులపై పాలకవర్గాల పెత్తనం పెరిగింది. ఇటీవల ప్యాక్స్ ల సిఇఓల బదిలీలు అన్ని డిసిసిబిలు దాని అనుబంధ సంఘాల కనుసన్నులలో జరిగాయి. కోర్టు మొట్టికాయాలు వెసిన  విషయం తెలిసిందే. ఏకంగా మేనేజర్ ల స్థాన చలనం కూడా వారి ఆదేశాల ప్రకారం జరిగాయి. గడిచిన ఏడాది బిచ్కుంధ మండలంలోని ఓ గ్రామంలో స్థానిక కో ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పై గ్రామస్థులు దాడిచేసినంత పనిచేశారు. ఈవ్యవహారంలో ఆనాడు పోలీస్ కేసు నమోదు చేశారు. దానిని విత్ డ్రా చేయడానికి ఆనాడు కూడా బదిలీ డ్రామాకు తెర తీసారు నాయకులు. కేసు విత్ డ్రా కావడంతో ఆవ్యవహరం అటకెక్కింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంక్ తో పాటు ఉద్యోగుల యూనియన్ నేతలు కిక్కురుమనడం లేదు. వారు కుడా పాలకవర్గం చెప్పు చేతులలో కీలు బొమ్మలు అన్న విమర్శలు లేకపోలేదు. సిరికొండలో బ్యాంక్ మేనేజర్ పరపతిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ పై సొసైటీ వైస్ చైర్మెన్ దూషణల పర్వం చేసిన ఇంత వరకు యూనియన్ నాయకులు స్పందిచకపోవడమే అందుకు నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటికే నాల్గవ తరగతి ఉద్యోగినిని బదిలీ పేరిట బెదిరిస్తున్న పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ జరుగుతుంది.

Society Vice Chairman in the Bank Manager's Chair

More articles

Latest article