27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నడుకుడ వాకర్స్ అసోసియేషన్ రూ.20 వేల విరాళం

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : మండలం లోని పచ్చల నడుకుడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు మార్చ్ ఫస్ట్ డ్రెస్ ల కొనుగోలు కోసం పచ్చల నడుకుడ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రూ. 20 వేల నగదు విరాళాన్ని అందజేశారు. ఈ నెల 17, 18,19 తేదీల్లో మండల కేంద్రంలో మండల్ టోర్నమెంట్ జరుగనున్న దరిమిలా విద్యార్థులకు మార్చ్ ఫాస్ట్ డ్రెస్ ల కోసం విరాళాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ జాడి రమేష్ కుమార్ కు అసోసియేషన్ సభ్యులు మంగళవారం అందజేశారు. ఈ విరాళాన్ని అందించిన వారిలో డాక్టర్. మారుతీ గౌడ్, ఏనుగు గంగారెడ్డి, అనుపల సతీష్, గడ్డం లింబారెడ్డి, బ్యాంక్ సాయిలు, అంక్సపూర్ మల్లేష్, విట్టల్, బాల్ రెడ్డి, చేపూరి సంతోష్,జానా ముత్యం, గుడాల అరుణ్, ఎక్స్ ఎంపీటీసీ రవి, ఫోటో స్టూడియో బాబు లు ఉన్నారు.

More articles

Latest article