నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలిసులు నమోదు చేసిన ఒక కేసు విషయంలో మానవ హక్కుల కమీషన్ నిజామాబాద్ ఎసిపి కి నోటిసులు జారీ చేసింది. నగరంలోని పెద్ధ బజార్ కు చెందిన చకీలం హరీష్ అనే యువకుడు తనపై స్థానిక ఐదవ టౌన్ పొలిస్ స్టేషన్ లో తనపై పోలిసులు నమోదు చేసిన గోలుసు చోరి కేసుపై మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించాడు. 2024 లో ఆనాటి నార్త్ సిఐ, స్థానిక ఐదవ టౌన్ ఎస్సైలు ఎలాంటి ఆధారాలు లేకున్న తనపై గోలుసు చోరి కేసు నమోదు చేసి ఇరికించారని అప్పటి పోలిస్ కమీషనర్ తో పాటు డిఐజీ నుంచి డిజీపిలకు లిఖీత పూర్వకంగా పిర్యాదు చేశారు. కాని పోలిస్ శాఖ స్పంధించకపోవడంతో లోకాయుక్తాతో పాటు మానవ హక్కుల కమీషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎడాధి ఈ కేసులో లోకాయుక్తా సంబంధిత పోలిసులకు తాఖీదులు జారీ చేసింది. తాజాగా మానవ హక్కుల కమీషన్ స్థానిక సిఐ, ఎస్ఐ లకు నోటిసులు ఇచ్చిన వారు స్పంధించకపోవడంతో సిరియస్ గా తీసుకుని నిజామాబాద్ ఎసిపికి తాఖీదులు జారీ చేసింది. నోటిసులకు స్పంధించకపోతే తామే యాక్షన్ తీసుకుంటామని పేర్కోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలిస్ అధికారుల తీరుపై మానవ హక్కుల కమీషన్ సిరియస్ గా ఉండటంతో అధికారులపై చర్యలు ఉంటాయా అనే చర్చ జరగుతుంది.
