25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్

Must read

📰 Generate e-Paper Clip

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ విజయం

వెబ్ డేస్క్, బతుకమ్మ :

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమిబలపరిచిన  సీపీ రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి పై 152 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఫలితాలను ప్రకటించారు. ప్రత్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. ఎన్నికల లెక్కింపు రాత్రి 6 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నుంచి పార్లమెంట్ లో ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరిగినవ విషయం తెలిసిందే. అధికార బిజేపి కూటమీకి క్రాస్ ఓటింగ్ భయం ఉన్నప్పటికి సీపీ రాధాకృష్ణన్ స్పష్టమైన మెజార్టీతో గెలువడం పట్ల ఎన్డిఏ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.

More articles

Latest article