27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పెన్షనర్లను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Must read

📰 Generate e-Paper Clip

  • రిటైర్డ్ ఏసిపి గంగారాం

 

ఆర్మూర్, బతుకమ్మ : పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని రిటైర్డ్ ఏసిపి గంగారాం అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్,  రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ ద్వితీయ మహాసభ  ఆదివారం ఆర్మూర్ లోని ఎమ్మార్ గార్డెన్స్  ఆర్మూర్ డివిజన్ మహాసభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకే ఆఫీసులో ఒకరికి పెన్షన్ మరొకరికి పెన్షన్ లేకపోవటం అన్యాయమని, బడ్జెట్ మొత్తం ఉద్యోగుల కోసం పెన్షనర్ల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పటం అన్యాయమని, అది అవాస్తమని ఆయన అన్నారు. ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు బాబా గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు కే.రామ్మోహన్ రావు మాట్లాడుతూ నగదు రహిత వైద్యం అన్ని కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించే విధంగా చూస్తామని ప్రభుత్వం అనేకమార్లు హామీ ఇచ్చిందని కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదని, లక్షలాది రూపాయలు  వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకుని పెన్షనర్లు వైద్యం చేయించుకుంటున్నారని , కానీ ప్రభుత్వానికి కనికరం కలగలేదని ఆయనఆరోపించారు. దాదాపు 40 సంవత్సరాలు  ప్రజల కోసం ,ప్రభుత్వం కోసం పనిచేసిన వారి చివరి రోజులలో ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందించకపోవడం దుర్మార్గమని వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ అన్నారు . దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు డిఏ ఎగ్గొట్టడానికి, పెన్షన్ రివిజన్ లేకుండా చేసేందుకు చట్టం తీసుకొచ్చిందని వారి దృష్టిలో పెన్షనర్లు ఇంకా ఎందుకు బతికే ఉన్నారని ఆలోచిస్తున్నారని వారన్నారు.  జిల్లా నాయకులు శిల్ప హనుమాన్లు మాట్లాడుతూ పెన్షన్ ఖర్చు పెరిగిందని వాటిని తగ్గించాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని  రాష్ట్ర ప్రభుత్వము పెన్షనర్లకు చట్టబద్ధంగా రావలసిన డి ఏ లు, పెండింగ్ లో ఉన్నాయని, పే డివిజన్ కమిషన్ ఉసేఎత్తటం లేదని, ఎన్నికల సమయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు  నీటి మీద రాతల్లా మారాయి అని వారన్నారు. పెన్షనర్ల న్యాయమైనటువంటి హక్కుల కోసం నిజాయితీగా నికరంగా పోరాటం చేస్తున్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పెన్షనర్ల, ప్రభుత్వ రంగ సంస్థల పెన్షనర్లు హక్కుల కోసం పోరాడుతున్నదని ప్రతి పెన్షనరు ఈ సంఘాన్ని ఆదరించి తీసుకుంటున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారన్నారు.  ఈ డివిజన్ మహాసభలో జిల్లా నాయకులు  జార్జ్, బన్సీలాల్, సాంబశివరావు, రాధా కిషన్, ఆర్మూర్ డివిజన్ నాయకులు సాయన్న, శంకర్, రాజేందర్, లింబ గౌడ్, సమద్ తదితరులు పాల్గొన్నారు.

Central and state governments are cheating pensioners

More articles

Latest article