పెన్షనర్లను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

రిటైర్డ్ ఏసిపి గంగారాం   ఆర్మూర్, బతుకమ్మ : పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని రిటైర్డ్ ఏసిపి గంగారాం అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్,  రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ ద్వితీయ మహాసభ  ఆదివారం ఆర్మూర్ లోని ఎమ్మార్ గార్డెన్స్  ఆర్మూర్ డివిజన్ మహాసభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకే ఆఫీసులో ఒకరికి పెన్షన్ మరొకరికి పెన్షన్ లేకపోవటం అన్యాయమని, బడ్జెట్ మొత్తం ఉద్యోగుల కోసం పెన్షనర్ల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పటం...