30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నగరంలో పలు డివిజన్లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజమాబాద్ సిటీ : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పదిరోజుల పాటు అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్చతా-హీ- సేవలు -2024 కార్యక్రమాలు నగరపాలక సంస్థ పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ నేతృత్వంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ మైదానంలో స్వచ్ఛత హీవా కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ నెంబర్ 28లో, డివిజన్ నెంబర్ 42, డివిజన్ నంబర్ 21, డివిజన్ నెంబర్ 44 బ్యాంకాలని తో పటు పలు ప్రాంతాలలోని పార్కులలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత, మహిళలు, రెసిడెన్షియల్ కాలనీల ప్రజలు, ప్రజాప్రతినిధుల శ్రమదానాలు, మానవ హారం, కాలనీల పరిశుభ్రత, డ్రెయిన్ ల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, పార్కుల పరిశుభ్రత, తడిచెత్త నుండి కంపోస్టు తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ విధానంలో పునర్వియోగం తదితర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని నిజామాబాద్ మున్సిపల్ అధికారులు తెలియజేశారు. అలాగే నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రజలు అనారోగ్యంతో గురికాకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ పిచికారి చేశారు. ఇలా చేయడం ద్వారా డెంగ్యూ, విష జ్వరాలు సోకకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.  కార్యక్రమాలలో నిజామాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తో పాటు, సానిటరీ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Cleanliness and service programs in many divisions in the city

More articles

Latest article