జోరుగా కల్తీకల్లు వ్యాపారం

0 1,294

చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
మండల కేంద్రంలో గల్లీకో కల్లు దుకాణం
బతుకమ్మ,  పిట్లం : పిట్లం మండల కేంద్రంలో జోరుగా కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. ప్రోభీషన్ ఎక్సైజ్ అధికారుల నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు మండలంలో కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వం వ్యాపారస్తులను అధికారులను మూకుమ్మడిగా చేసి వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగించారు.ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం సైతం వీటి విషయంలో నివారణ చర్యలు చేపడుతారన్న ప్రజల అభిప్రాయానికి ఏ మేరకు న్యాయం చేస్తారారో అని మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Vigorous counterfeiting business

కృత్రిమంగా తయారుచేసిన కల్లు వ్యాపారంచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు విముకత చూపుతున్నారన్న విమర్శలు సైతం మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిపోలో కృత్రిమ రసాయనలతో కల్లును తయారుచేసి రాత్రికి రాత్రి కేంద్రాలకు తరలిస్తున్నరు.అధికారులు పట్టించుకోకపోవడం పై పలు విమర్శలు ఉన్నాయి.నిబంధన ప్రకారం ఎప్పటికప్పుడు దిన సమయంలో సరఫరా చేయాల్సిన కల్లు ను రాత్రి సరఫరా జరగడం ఎంతవరకు సమంజసమని మండలంలోని కల్లు ప్రియలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారుల స్పందించే విడిపోయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

Vigorous counterfeiting business

Leave A Reply

Your email address will not be published.