కాామారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు వద్ద భారీ వర్షానికి వచ్చిన వరద తాకిడికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, బ్రిడ్జి లను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వార పరిశీలించారు సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు , జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. అంతకు ముందు ఎర్రపహాడ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు 12:59 ని. లకు సీఎం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి గౌరవ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవగాంధీ హన్మంతు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.


