నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వాసి,సామాజిక సేవా కార్యకర్త బంగారు సాయిలు కు అమెరికా దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోలోసా వారు అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డును బహుకరించారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంగారు సాయిలు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి టోలోసా యూనివర్సిటీ వారు అంబేద్కర్ పేరిట ఉన్న అంతర్జాతీయ అవార్డును అందించడం ఆనందం కలిగిస్తుంది అన్నారు. ఈ అవార్డు రావడంతో మరింత బాధ్యతలు పెరిగాయాన్నారు. జిజి కాలేజీలో ఎన్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి నేటి వరకు తాను చేసిన సేవల పేపర్ కటింగ్ లను యూనివర్సిటీ ఆఫ్ టోలోసా కు పంపడంతో తనకు ఈ గుర్తింపు లభించింది అన్నారు. జిల్లాలో ఈ అవార్డు సాధించిన వ్యక్తిని తాను ఒక్కడినేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోనేరు సాయికుమార్, అశోక్, షేక్ హుస్సేన్, పింకీ, కేశ్ పల్లి రవి, సక్కి ప్రభంజన్, తదితరులు పాల్గొన్నారు.
