27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

తాడ్వాయి, బతుకమ్మ : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో  తాడ్వాయి మండలం సంతాయిపేట్ భీమేశ్వరాలయ పరిసర అటవీ ప్రాంతంలో విత్తన బంతుల విసరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తో కలిసి జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్తు తరాలకు  శుద్ధమైన ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గ్లోబల్ వార్మింగ్ నివారించి కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగిందని సుమారు మన జిల్లాలో లక్షకు పైగా సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగిందన్నారు.  పచ్చదనం పెంచే విప్లవాత్మకమైన  ఈ  కార్యక్రమంలో  జిల్లా ముందు వరసలో ఉన్నందుకు చాలా సంతోషంగా గర్వంగా  ఉంది అని,  విద్యార్థులను ప్రోత్సహించి ఈ బృహత్కర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులను, జిల్లా సైన్సు అధికారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఒక ప్రాజెక్టు వర్క్ గా ఇచ్చి 2 లక్షల సీడ్ బాల్స్ ను తయారు చేయించి, ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే అడవులలో తయారుచేసిన సీడ్ బాల్స్ విద్యార్థుల చేత మరియు ఆయా గ్రామాలలో ఉన్న ప్రజల చేత సమాజంలో ఇట్టి కార్యక్రమం పట్ల చైతన్యం కలిగే విధంగా ఒక  పండుగ లాగ నిర్వహించాలనిజిల్లా కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో గ్రామాలలో చాలా ఇబ్బందులు పెడుతున్న కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోవాలంటే ఈ విధంగా తయారుచేసిన పండ్ల మొక్కల విత్తనాల తో పండ్ల చెట్లు మొలకెత్తి పండ్లను ఇచ్చినట్లయితే వన్యప్రాణులకు కావలసిన ఆహారం లభిస్తుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ ఈ సీడ్స్ బాల్ తయారీ కార్యక్రమంలో ఒక మహా ఉద్యమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించి ముందుకు సాగాలని తెలిపారు. విద్యార్థులలో పర్యావరణం పట్ల అవగాహన కలిగి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని తద్వారా బావి పౌరుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపీఓ  సరిత రెడ్డి, అటవీ శాఖ అధికారులు, బిక్నూర్ బాలుర ఉన్నత పాఠశాల పాల్వంచ ఉన్నత పాఠశాల, కృష్ణాజివాడి ఉన్నత పాఠశాల,చిట్యాల ఉన్నత పాఠశాల మరియు సంతాయి పేట్ పాఠశాల విద్యార్థులతో పాటు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి, తాడ్వాయి మండల ఎంఈఓ రామస్వామి, ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి,సుజాత, రాము, ఫిజికల్ డైరెక్టర్స్ నర్సింహారెడ్డి, హాటికుళ్ళ  తదితరులు పాల్గొన్నారు.

Environmental protection is everyone's responsibility

More articles

Latest article