బతుకమ్మ భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బేసిక్ లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో వనమహోత్సవం గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,గ్రామీణ ఉపాధి హామీ సంస్థల ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంగణంలో 30 వేల మొక్కలు నాటాలని సంకల్పించామని, అందులో భాగంగా ఇప్పటికే 15 వేల మొక్కలు నాటడం పూర్తి అయ్యిందన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తే అవి ఆక్సిజన్ ఇస్తూ మనకు రక్షణ కల్పిస్తాయి అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. సౌత్ క్యాంపస్ లో వనమహోత్సవం జరపడం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. అమ్మ పేరుపై ఒక మొక్క నాటి రక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.వన క్షేమమే మన క్షేమం అని,అందుకే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటి క్షేమానికి కృషి చెయ్యాలని అన్నారు. మొక్కలు స్పాన్సర్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ప్రతిజ్ఞ, డా.యాలాద్రి లను సన్మానించారు. అనంతరం డా.సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ క్యాంపస్ లో పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు,పూల మొక్కలు నాటుతున్నామని, అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. సౌత్ క్యాంపస్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం సంస్థ లకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, భిక్కనూరు ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఎమ్మార్వో సునీత,రాధిక ,సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, డా. మోహన్ బాబు,డా.లలిత,డా.హరిత, డా.అంజయ్య,డా.నాగరాజు,డా.ప్రతిజ్ఞ, డా.s.నారాయణ , డా.రమాదేవి,డా.నర్సయ్య, ఏపీఆర్వో డా.సరిత, డా.శర్మ, శ్రీకాంత్,దిలీప్,డా.శ్రీకాంత్, డా.సంతోష్ గౌడ్,పోతన్న మరియు విద్యార్థులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
