28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసీపీ రాజా వెంకట రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసీ పోలీస్ స్టేషన్ ల  చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను పట్టణాలలో ఉన్న వార్డులను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. త్వరలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు  ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు  పొందాలని అన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి  సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్  వాటిపై నిఘా పెంచాలని తెలిపారు  ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి  ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు.

ACP Raja Venkata Reddy inspected the Fifth Town Police Station

More articles

Latest article