తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో వనమహోత్సవం
బతుకమ్మ భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బేసిక్ లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో వనమహోత్సవం గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,గ్రామీణ ఉపాధి హామీ సంస్థల ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంగణంలో 30 వేల మొక్కలు నాటాలని సంకల్పించామని, అందులో భాగంగా ఇప్పటికే 15...