ఆదివారం 17,000 మంది భక్తులకు మంచు లింగం దర్శనం
వెబ్ న్యూస్, బతుకమ్మ : అమర్నాథ్ యాత్ర జరిపే యాత్రికుల సంఖ్య ఆదివారంతో 2 లక్షల స్థాయి దాటిపోయింది. అమర్నాథ్ లో ఆదివారం ఒక్క రోజు 17,000 మంది భక్తులు పవిత్ర మంచు లింగం దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహాలయానికి ప్రయాణించిన యాత్రికుల సంఖ్య 2లక్షల అరవై మూడుకి చేరుకుంది.
