నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వీహచ్పీఎస్ వికలాంగుల పెన్షన్ పెంపు కోసం, ఆసరా, చేయూతదారుల పెన్షన్ పెంపు కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా కు సోమవారం వీహెచ్పీఎస్, ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో మెమోరండం అందజేశారు. ఈ నెల 18న నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల లక్ష్మీ కళ్యాణ మండపంల వీహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా సదస్పు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరు అవుతారని తెలిపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద మొత్తం లో హాజరు అయి పింఛన్ పెంపు పోరాటం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, ఎంఎస్పీజిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి, సీనియర్ నాయకులు మైలారం బాలు, ఎంఎంఎస్ యమున ,శీలం యాదగిరి మాదిగ, వీహెచ్పీఎస్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

