25.5 C
Hyderabad

కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ఓటు బ్యాంకు లాగానే చూస్తాది

The Congress party views minorities merely as a vote bank

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నాలుగేళ్లుగా అర్సపల్లి ఆర్ఓబికి భూ సేకరణ జరుపలేదు

. . . బోధన్ లో నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టలేమని సుదర్శన్ రెడ్డి చేతులెత్తేశారు

. . . పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి

నిజామాబాద్, బతుకమ్మ:

పని చేస్తున్నం మాకు ఓట్లు వేయమని ముస్లీంలను అడుగుతున్నాం. కానీ మైనార్టీలకు కాంగ్రెస్ అంటేనే ప్రేమ. వారికి మాత్రం అడగకుండానే ఓట్లు వేస్తున్నారు. వారు ఓట్లు వేయరు అని తెలిసిన మైనార్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో  అభివృద్ధి పనులు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లీంలను ఓటు బ్యాంకుగా చూస్తుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న అర్సపల్లి ఆర్ఓబి నిర్మాణ పనులను శనివారం ఎంపీ అర్వింద్ ధర్మపురి అధికారులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లింలపై ప్రేమ లేదని కేంద్ర ప్రభుత్వం నిధుల తో నిర్మిస్తున్న  అర్సపల్లి ఆర్ ఓబి పనులు నిదర్శనం అన్నారు. కేంద్రం 127 కోట్లు కేటాయించి పనులు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూసేకరణ కోసం రూ.10 కోట్లు కేటాయించడానికి మనసు ఓప్ప లేదని అన్నారు. తాను ఇటీవల ఆర్ ఓ బిల కోసం దీక్ష చేసిన భిక్షాటన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మాధవ నగర్ కు నిధులు విడుదల చేస్తామని చెప్పిందన్నారు. ఇక అర్సపల్లి ఆర్ ఓ బి కోసం భూసేకరణ నిధులు విడుదల చేస్తుందని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. అర్సపల్లి ఆర్ ఓ బి నిర్మాణం కారణంగా రైల్వే ట్రాఫిక్ కేబుల్స్ మార్పిడి కోసం కేవలం రూ.60 లక్షల విడుదలకు లేఖ రాయలేని దుస్థితిలో ఉన్నారని ఎంపి అరవింద్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో ముస్లింలు బిజెపి ఓటు వేయలేదని గతంలో గణేష్ గుప్తాకు, మొన్న కాంగ్రెస్ అభ్యర్థికి వేసిన తాను మాత్రం మోడితో కోట్లాడి రూ.127 కోట్లతో అర్సపల్లి ఆర్ ఓ బి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తనకు పేరు అక్కర్లేదని కావాలంటే పేపర్  పై రాసిస్తానని ఎంపి అర్వింద్ అన్నారు.

The Congress party views minorities merely as a vote bank

బోధన్ లో ఆర్ఓబి కోసం గత ప్రభుత్వం నిర్మాణం చేసిన సాంక్షన్ కాలేదు, తాను చేసిన వినతికి స్పందించిన కేంద్రం రూ.90 కోట్లతో నిర్మాణంకు 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పీఎం మోడీ పర్చువల్ పద్ధతిలో పనులను ప్రారంభించారు అని గుర్తు చేశారు. బోధన్ లో పెరుగుతున్న ట్రాఫిక్, భవిష్యత్తు అవసరాల కారణంగా మాధవ నగర్, అర్సపల్లి మాదిరిగా ఫోర్ లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశానని తెలిపారు. కానీ బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రధాన సలహాదారు బోధన్ కు నాలుగు లేన్ల ఆర్ ఓ బి అక్కర్లేదని, రెండు లైన్ల నిర్మాణం చేస్తే చాలని ప్రభుత్వం వద్ధ పైసలు లేవని చేతులెత్తేశారు అని ఎంపి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ ట్రాఫిక్ అవసరాలు, ప్యూచర్ కారణంగా మాధవ నగర్ ఆర్ఓబిని నాలుగు లేన్లు గా మార్చానని, బోధన్ కు భూసేకరణ అక్కర్లేదని కేవలం రూ.90 కోట్లు ఇస్తే ఫోర్ లైన్ ల బ్రిడ్జి అంటే సుదర్శన్ రెడ్డి కి ఇష్టం లేదని, బోధన్ లో మెజారిటీగా ఉన్న మైనార్టీల అంటే ప్రేమనే లేదని విమర్శించారు. తాను స్పందించి దీక్ష చేయడంతో  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్య రెండు రోజుల క్రితం పరిష్కారమైందని అధికారులు తెలియజేశారు. ఇకనైనా మిగిలిన ఆర్వోబీ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎంపితో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్  పాల్ సూర్యనారాయణ , జాతీయ పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి , రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి , జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి  రైల్వే డి ఆర్ యూసిసి సభ్యులు సురేష్ బాబు, ఆర్ అండ్ బి, రైల్వే అధికారులు,భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు.

The Congress party views minorities merely as a vote bank

 

More articles

Latest article