ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డిలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల సందర్శన
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఇటీవల ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని బాలికల గురుకుల పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్
ఈ సందర్బంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులతో సమావేశమై వారి వసతి గృహాలు, భోజన సదుపాయాలు, పాఠశాల వాతావరణం తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…’విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలను సహించేది లేదన్నారు.పిల్లల భవిష్యత్తు మన బాధ్యత. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే విద్యార్థుల కోసం అందించబడుతున్న భోజనం స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్య, వసతి, పారిశుద్ధ్య సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, తాజా మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్, టౌన్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

