హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధి మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్య కర్తలు మల్లన్న కార్యాయలంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.

