27.5 C
Hyderabad
Friday, July 31, 2026

పోన్ ట్యాఫింగ్ కేసు సిబిఐకి అప్పగించేలా న్యాయస్థానం ను అశ్రయించి ప్రభుత్వంపై ఓత్తిడి తెస్తాం

Must read

📰 Generate e-Paper Clip

. . . జాతీయ పసుపు బోర్డు జిల్లాకు కేంద్రం ఇచ్చిన బహుమతి

   . . . సీఎం రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి ఇవ్వాలి

. . . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 నిజామాబాద్, బతుకమ్మ:

కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి ఇవ్వాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే న్యాయస్థానం ద్వారా ఆదేశాలు తెచ్చుకుని సీబీఐ కి కేసు ఇచ్చేలా ఒత్తిడి తెస్తాము అన్నారు.ఈనెల 29 న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నిజామాబాద్  పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని పార్టి కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ….

మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జాతీయ పసుపు బోర్డు కోసం ఒత్తిడి చేసినప్పటికీ ప్రధాని మోదీ మాత్రం నిజామాబాద్ కు  కేటాయించారు. ఇది జిల్లాకు ఒక బహుమతి అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. …దశాబ్దాల పసుపు రైతుల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డ్ కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు  అని తెలిపారు. ఇందూరు జిల్లా రైతు ఉద్యమాలకు, చైతన్యానికి ప్రతీక అని వారు పసుపు బోర్డు కోసం పోరాటాలు చేస్తుండగా ఎంపి ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హమీ మేరకు కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయంను ప్రారంబించిన ఆనంతరం జరిగే రైతు సదస్సులో  అమిత్ షా పసుపు బోర్డు లోగోను ఆవిష్కరిస్తారు అని తెలిపారు.దివంగత నేత డీ శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా డీ ఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు  అని  పేర్కోన్నారు.

We will pressure the government by moving the court to hand over the phone tapping case to the CBI.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో సి బి ఐ విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ లో కేవలం రాజకీయ నేతలనే కాకుండా అన్ని వర్గాల బాధితులు ఉన్నారు . ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై అనుమానాలు ఉన్నాయి . టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బి ఆర్ ఎస్ నాయకులు వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు  ఇది సాదా సీదా కేసు కాదు..తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసు సిబిఐ కు అప్పగించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, పార్టి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ, ఎమ్మెల్సీ అంజల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

 

 

More articles

Latest article