29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్పొరేట్ కంపెనీలకు ఏజెంటుగా మోడీ ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

  • టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిష్ పటేల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్పొరేట్ కంపెనీలకు ఏజెంటుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిష్ పటేల్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వేలాదిమంది కార్మికులతో భారీర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిపారు. ఈ సభకు టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన టియుసిఐ జాతీయ అధ్యక్షులు  కామ్రేడ్ అమ్రిష్ పటేల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అధిపతులు అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతున్నారన్నారు. విమానాలు, విమానాశ్రయాలు, నౌకలు, నౌకాశ్రయాలు, రైళ్లు రైల్వేస్టేషన్లు అన్ని ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. అందుకే తరచూ రైళ్ల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓడల్లో మాదకద్రవ్యాల రవాణా ఘటనలు జరుగుతున్నాయన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నదన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్రవేస్తూ, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించి, పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికోద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇతర కార్మిక సంఘాలతో ఐక్య కార్యాచరణగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సూర్యం మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు 26వేలు, కనీస పెన్షన్ 9వేలు అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత, అసంఘటిత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్ ఎస్ఎల్ పద్మ ఎం.హన్మేష్ సహాయ కార్యదర్శి కే.రాజన్న, జీ.రామయ్య, సి.వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ రాష్ట్ర నాయకులు వెంకన్న, రాజేశ్వర్, ముత్తన్న మల్లేష్, యాకూబ్ షావలి, వెంకట్ రెడ్డి,  అశోక్, సాంబశివుడు, కిరణ్, ప్రసాద్, హనుమంతు, రాజు మరియు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

Modi government as an agent for corporate companies

More articles

Latest article