కామారెడ్డి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లలో నరేంద్ర మోడీ ఎస్సీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రపంచం నలువైపులా అంబేద్కర్ రి వైపు చూసేలా చేశారని అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను అనేక మందికి తెలియజేశారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగా ఉన్న వాటిని నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శివాజీ, పొతంకా లక్ష్మీనారాయణ, సందీప్, సాయిరాం, కెప్టెన్ రాజు, ప్రతాప్, బాలకృష్ణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
