. . . అదనపు కలెక్టర్ సిసి రాజశేఖర్ తో పాటు కుటుంబ సభ్యులకు గాయాలు
భిక్కనూరు, బిక్కనూర్
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. రోడ్డు ప్రమాదంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సిసి రాజశేఖర్ తన స్నేహితుడు మోహన్ తో పాటుగా వారి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రాజశేఖర్ వారి కుటుంబ సభలతో కలిసి కారులో మెదక్ జిల్లా నాచారం దర్శనానికి వెళ్లి తిరిగి ప్రయాణంలో భిక్కనూరు మండలంలోని ఉత్తర రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది ప్రమాదంలో రాజశేఖర్ తో పాటు అతని భార్యని నిహారిక కుమారులు అద్వైత్, అరూస్ తో పాటుగా మోహన్ అతని కుమారునికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గాయపడిన వారిని వెంటనే అతని సొంత కారులో స్థానికుల సహాయంతో బయటకు తీసి తన కారులో కామారెడ్డి ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు.

