25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాధవ నగర్ నాలుగవ డివిజన్ నరసన్న కాలనీలో గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 25 సంవత్సరాల నుండి  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మాధవ నగర్ నాలుగో డివిజన్లో డి ఫోర్త్ కెనాల్ కట్టపై గత 25 సంవత్సరాల నుండి అన్ని కులాల ప్రజలు రోజువారి కూలీలు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. ఇదివరకు ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులను ప్రజాప్రతినిధులను కలుసుకుంటూ తమ గోడును విన్నవించుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆర్డిఓ కు ఫోన్ చేసి మాట్లాడి అతి తొందరగా కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. తొందరలో రోడ్డు వేయించి ఇల్లు కట్టిస్తామని పేద ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, తరుణ్, వేణు, తెలంగాణ రైతుకుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు భామండ్ల రవీందర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్ల మల్లేష్, కత్తుల మారుతి, జిల్లా కమిటీ సభ్యులు నరసింహులు గౌడ్, సత్యనారాయణ, అల్లే నరసింహులు, అనుష, రజియా, శంకర్, కాలనీవాసులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Request to MLA to grant degrees

More articles

Latest article