28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధనతో పాటు అన్నీ రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంఈఓ కట్ట శ్రీనివాస్ రావు సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఇంగ్లీష్ మీడియం) ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రధాన వీధుల గుండా బడి బాట కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు.  ఈ సందర్బంగా ఎంఈఓ కట్ట శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, దుస్తువులు, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల వ్యక్తిగత పర్యవేక్షణ, చదువుతోపాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కావున తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వం పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ కే. కోటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ దస్తగిర్, అంగన్వాడీ టీచర్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article