27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పల్లెవెలుగు వచ్చేస్తుందోచ్..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: మెట్ పల్లి డిఫో బస్సు బుధవారం నుండి మోర్తాడ్ నుండి నిర్మల్  వరకు బస్సు ప్రారంభించండం జరుగుతుందని యువ నాయకుడు గురిజాల నర్సారెడ్డి తెలిపారు. ఈ బస్సు దొంకల్, ధర్మోరా, రేంజార్ల, వెంచిర్యాల్, వెల్కటూరు, చాకిర్యల్ గ్రామాల మీదుగా నిర్మల్ వరకు అక్కడి నుంచి మోర్తాడ్ వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. చాలా సంవత్సరాల కిందట ఈ మార్గంలో మెట్పల్లి డిపో బస్సులు నడిచాయని మధ్యలో బంద్ చేయడం జరిగింది. దీంతో శేట్ పల్లీ గ్రామస్తులు డిపో మేనేజర్ తడికమల దేవరాజును కలిసి విన్నవించడంతో స్పందించి బుధవారం నుంచి పున ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో గ్రామంలో మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో గురిజాల నర్సారెడ్డి, బబ్బురి శ్రీనివాస్, మెంచు  చిన్న నర్సయ్య, శ్రీనివాస్, ప్రభాకర్, ఊరడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

The village light is coming..

More articles

Latest article