బతుకమ్మ, బాన్సువాడ : రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ అరుణ హెచ్చరించారు.బాన్సువాడ పట్టణంలో పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిష్టర్లు పరిశీలించారు. ఏఏ కంపెనీల విత్తనాలను విక్రయిస్తున్నారని విషయాలను ఆరాతీశారు. డీలర్లు అనుమతి లేకుండా విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నాసిరకమైన విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఏవో మిస్బా ఫైజుల్లా, సీఐ రాజేష్ ఉన్నారు.