- వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : వర్తమాన సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలే పరిష్కారాలు అని తేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం 21వ శతాబ్దంలో డా.బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనల ఔచిత్యం అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ వాణి నేతృత్వంలో వేబినార్ వేదిక గా చర్చించారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల ఈ వేబినార్ కార్యక్రమాన్ని సమన్వయపరిచినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు హాజరై ప్రసంగిస్తూ డా. బి. అర్. అంబేద్కర్ భారతదేశాన్ని కేవలం రాజకీయంగా కాకుండా సామాజికంగా ప్రజాస్వామ్యంగా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం రూపొందించినారన్నారు. వర్తమాన సమాజంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనల ఆచరణ అనుసరణీయమన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి సందేశమిస్తూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను వేరువేరుగా చూడలేమన్నారు. విశాల భారతదేశానికి దృఢ, అదృడమైన గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ అంబేద్కర్ దని కొనియాడారు. ఈ వేబినార్ లో కీలకోపన్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ .ఎన్. సూకమార్ ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి ప్రసంగించినారు. 75 సంవత్సరాలలో భారత రాజ్యాంగం అనేకనేక మలుపులు జరిగిందన్నారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అనివార్యస్థితి భారత ప్రజలకు ఉందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి నాగరాజు 21వ శతాబ్దంలో విశ్వవిద్యాలయాల్లో కులం ప్రాధాన్యత అనే అంశంపై ప్రసంగించారు. ఆధునిక భారతదేశం ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో వేగం పంచుకున్న సందర్భంలో మరొకవైపు కులం మతం సంప్రదాయాలు విశ్వవిద్యాలయాల్లో విస్తరించడం విచారకరమన్నారు. కేఆర్ఈఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి సాంబయ్య అంబేద్కర్ ఆలోచనలు అట్టడుగు వర్గాల అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. అంబేద్కర్ అణగారిన వర్గాలకు, నిమ్న కులాలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి పాల్పడి నారని గుర్తు చేసినారు. ఈ విభినార్ సమావేశంలో విశ్వవిద్యాలయ డీన్ లు ఆచార్య ఘంటా చంద్రశేఖర్, ఆచార్య రాంబాబు గోపిశెట్టి, డైరెక్టర్ పి ఆర్ ఓ డా. ఏ పున్నయ్య, డాక్టర్ నాగరాజు పాత, జెట్లింగ్ ఎల్లోసా, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ సంపత్ పరిశోధక విద్యార్థులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

