డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి ఖిల్లా రామాయలయంలో రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి దంపతులు శ్రీరామ నవమి సందర్బంగా సీతా రామ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారామ ని కల్యాణ మహోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి దంపతులు కలసి స్వామి వారి కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముని జన్మదినం రోజే కల్యాణ మహోత్సవం వుండటం ఇటువంటి కార్యక్రమం లో తాను పాల్గొనడం చాలా సంతోషంగా వుందన్నారు. ఈ ఖిల్లా రామాలయం గురించి తాను అసెంబ్లీ లో కూడా

మాట్లాడం జరిగిందని తెలిపారు. ఖిల్లా రామాలయం పర్యటన కేంద్రంగా మార్చి ఇక్కడ బోటింగ్ సదుపాయం, చిన్నారులకు పార్క్ లాంటి సౌకర్యం కల్పిచాలని కోరినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, డిచిపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ఆలయ చైర్మన్ శాంతయ్య, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పోలసాని శ్రీనివాస్,గ్రామ నాయకులు సుదర్శన్,సాయిలూ తదితరులు పాల్గొన్నారు.

