28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:  మూల విరాట్టుకు ఉత్సవానంతర స్నపన సేవతో వేద పండితులు బుధవారం ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలను ముగించారు. యజ్ఞాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు 108 కళశాల్లో అభిషేక గంగను తీసుకొచ్చి స్వామి వారికి ఉత్సవానంతర అభిషేకం చేశారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో త్రిదండి దేవానాథ జీయరు స్వామి  ప్రత్యక్ష పర్యవేక్షణలో  ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి  ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా పరిపూర్ణమయ్యాయని ఆలయ ధర్మకర్త నరసింహ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజల సహకారం మరువలేనిదన్నారు. బ్రహ్మోత్సవాలకు జిల్లాలోని ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. వచ్చే సంవత్సరం (2026) లో  12వ బ్రహ్మోత్సవాలను  పెద్ద వేడుకగా నిర్వహిస్తామని నరసింహ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమాల్లో గంగోత్రి రామానుజదాసు స్వామి, ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు దంపతులు, నర్సింహారెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, నర్సారెడ్డి, నరాల సుధాకర్, పృథ్వీ, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, సురేశ్, రవి, చిన్నయ్య,  సాయిలు, యాజ్ఞాచార్యులు శిఖామణి ఆచార్యులు, సత్యనారాయణాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు, శ్రీకర్ కుమారాచార్యులు, విజయ్  స్వామి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article