ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్, బతుకమ్మ: మూల విరాట్టుకు ఉత్సవానంతర స్నపన సేవతో వేద పండితులు బుధవారం ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలను ముగించారు. యజ్ఞాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు 108 కళశాల్లో అభిషేక గంగను తీసుకొచ్చి స్వామి వారికి ఉత్సవానంతర అభిషేకం చేశారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో త్రిదండి దేవానాథ జీయరు స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా పరిపూర్ణమయ్యాయని ఆలయ ధర్మకర్త నరసింహ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజల...