27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్హులందరికీ రుణమాఫీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట, బతుకమ్మ: అర్హులందరికీ రుణమాఫీ చేయాలని, రైతుబంధు ఆర్థిక సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని బినోల సహకార సొసైటీ సభ్యులు కోరారు. చైర్మన్ మగ్గరి హన్మాండ్లు అధ్యక్షతన 63వ మహాజన సభను శనివారం నిర్వహించారు. సీఈవో రమేశ్ సంఘం లావాదేవీలను, లాభనష్టాలను చదివి వినిపించారు. అనంతరం సభ్యులు పలు తీర్మానాలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆమోదించారు. నారాయణపూర్ లో నూతన ఎరువుల గిడ్డంగి నిర్మాణం, సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలకు ఇన్ చార్జీల నియామకం, లింగాపూర్ లో నిర్మించిన ఎరువుల గిడ్డంగి యొక్క అంచనా వ్యయానికి మించిన రూ.17వేల బిల్లులు చెల్లింపు, సంఘం నందు సాంకేతిక కారణాల వల్ల రుణం మాఫీ రాని సభ్యులకు ప్రాథమికంగా సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ పై న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టుట ఆ తరువాత సంఘ సభ్యులు నష్టపోకుండా వారి రుణమాఫీ పూర్తిగా ఆయ్యేలా చూడాలని జిల్లా సహకార అధికారి గారి అనుమతి తీసుకుంటూ తీర్మానాలు చేశారు. మహాజన సభలో వైస్ చైర్మన్ ఖాజా ఆశమొద్దీన్, పాలకవర్గ సభ్యులు అంజాగౌడ్, విజయ్, ప్రదీప్ రావు, బాలు చందర్, కాసర్ల లక్ష్మి, సంపూర్ణ, సొసైటీ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.


Loan waiver should be given to all eligible people.

 

More articles

Latest article