రఘునాథ ఆలయ అభివృద్ధికి రూ. 20 కోట్లు ఇవ్వండి

0 2,165

శాసన సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

హైదరాబాద్, బతుకమ్మ  : తెలంగాణ శాసన సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం శాసనసభలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇందూర్ పట్టణంలో సుమారు వెయ్యి ఏళ్ల చరిత్ర గల శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థకు చేరిందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్న దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆల్వారు స్వామి ఖిల్లా జైల్లో బందీలుగా ఉండి తమ రచనలు, కవిత్వాల ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేశారని గుర్తు చేశారు. మహనీయులు చారిత్రక ఆనవాళ్లు కలిగిన కోట ఇందూర్ ఖిల్లా అని అన్నారు. దాశరథి రాసిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పదాలు ఆయన గడిపిన 8వ నెంబర్ గదిలో నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నారు. ఎత్తనా ప్రదేశంలో కుర్నాపీఠం పై సీతారాములు ప్రత్యక్షమై భక్తులకు దర్శనం ఇస్తూ  కనిపిస్తారన్నారు.  ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దేవాలయ భూమి కబ్జాకు గురి అవుతుందన్నారు. అక్కడే ఉన్న బొడ్డెమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ పేరుతో గత ప్రభుత్వం రూ. 22 కోట్లనిధులు కేటాయించిన అభివృద్ధి జరగలేదన్నారు. ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు, శ్రీరామ కల్యాణ వేదిక, దాశరథి మందిరం, గుడి గోపురం, పైకప్పు, గోడల మరమ్మతులకు, మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటుకు కనీసం రూ. 20 కోట్ల స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.