అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
నవీపేట, బతుకమ్మ: అర్హులందరికీ రుణమాఫీ చేయాలని, రైతుబంధు ఆర్థిక సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని బినోల సహకార సొసైటీ సభ్యులు కోరారు. చైర్మన్ మగ్గరి హన్మాండ్లు అధ్యక్షతన 63వ మహాజన సభను శనివారం నిర్వహించారు. సీఈవో రమేశ్ సంఘం లావాదేవీలను, లాభనష్టాలను చదివి వినిపించారు. అనంతరం సభ్యులు పలు తీర్మానాలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆమోదించారు. నారాయణపూర్ లో నూతన ఎరువుల గిడ్డంగి నిర్మాణం, సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలకు ఇన్ చార్జీల నియామకం, లింగాపూర్ లో...