26.3 C
Hyderabad

టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన పీఆర్ టీయూ నూతన కార్యవర్గం

Newly elected PRTU executive committee meets TPCC's Mahesh Kumar Goud.

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

ఇటీవల నూతనంగా ఎన్నికైన పీఆర్ టీయూ జిల్లా నూతన కార్యవర్గం టీపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పిఆర్టీయూ నూతన జిల్లా అధ్యక్షులు అంబెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్ లు మహేష్ కుమార్ గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.. అనంతరం వారు మహేష్ కుమార్ గౌడ్ తో పలు సమస్యలను విన్నవించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను అమలుపరిచేందుకు గత సంవత్సరం 105 పాఠశాలకు అనుమతినిచ్చిందని, అలాగే ఈ సంవత్సరం జిల్లాలోని 112 పాఠశాలల కు అనుమతినిచ్చిందనీ ఆ పాఠశాలలకు కావలసిన ఇన్స్ట్రక్టర్లను, ఆయాలను నియమించకపోవడం వలన ఆ పాఠశాలలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.ఈ సందర్భంగా ఆ పాఠశాలలో ఆయాలను ఇన్స్ట్రక్టర్లను త్వరగా నియమించవలసిందిగా కోరారు.అదేవిధంగా గత సంవత్సరం నియమించబడిన ఇన్స్పెక్టర్లకు, ఆయాలకు వేతనాలు అందకపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని కూడా పరిష్కరించాల్సిందిగా కోరారు. గత సంవత్సరం 10 పాఠశాలల్లోని స్కావెంజర్లకు సుమారు నాలుగు నెలల శాలరీస్ ఇవ్వకపోవడం వలన వారందరూ కూడా ఆందోళన చెందుతున్నారని శాలరీస్ ని  త్వరగా జమ చేయాలని కోరారు.అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన  పీఆర్ సీ, సీపీఎస్ రద్దు డీఏల గురించి ముఖ్యమంత్రితో చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శిలు పెంట జలంధర్, వెంకటేశ్వర్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, కృష్ణారెడ్డి,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చిలుక శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి కిషన్, నిజామాబాద్ నార్త్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ, పిఆర్ టియు మండల బాధ్యులు దయాకర్, కిషోర్, సుంకరి నరేష్,విశ్రాంత ఉపాధ్యాయులు రాజేందర్ పాల్గొన్నారు.

More articles

Latest article