నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా అడ్వొకేట్స్ మ్యుచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ 2025 – 26 వార్షిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన ఎన్నికల అధికారి గా ఎర్రం విఘ్నేశ్, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా బిట్ల రవిని నియమిస్తూ సొసైటీ అధ్యక్షుడు మాదస్తు రాజారెడ్డి, కార్యదర్శి కొండకొల్ల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సొసైటీ కార్యాలయంలో రాజారెడ్డి, శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల విధివిధానాలు ఎన్నికల అధికారులు ప్రకటిస్తారని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నిర్మల్కర్ సంతోష్, నారాయణ దాసు, గోవర్ధన్, శంకర్, న్యాయవాదులు నరేందర్ రెడ్డి, మాణిక్ రాజు, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
