బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఘన విజయం సాధించటం పట్ల ఏర్గట్ల మండల బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి,మాజీ సర్పంచ్ సోమ రాజారెడ్డి,మాజీ ఎంపీటీసీ బొల్లి శంకర్,మాజీ ఉప సర్పంచ్ పెద్ద సంజీవ్ యాదవ్,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జక్కని వంశీ,ఆనందం గంగేష్, గుండ విటల్,కూరాకుల భూమేష్,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
