30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

 

బోధన్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రైవేటు విద్యాసంస్థల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి  ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి  కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎన్నికల కొరకై పట్టాభద్రులచే ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాబోవు రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు బేసిక్ శాలరీ, ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్  ముఖ్యమంత్రి తో మాట్లాడి 50% ఇప్పిస్తారని, విద్యాసంస్థలకై ప్రత్యేక నిధిని కేటాయిస్తానని తెలిపారు. నిరుద్యోగుల సమస్యకై పోరాడుతానని, పట్టాభద్రుల అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనని గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గంగా శంకర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article