30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
  • ప్రజావాణికి 118 దరఖాస్తులు

 

కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణి లో అర్జీలను సమర్పించడం జరిగిందని, అట్టి దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యలు, రైతు భరోసా,  గ్రామ సమస్యలు, ఇతర అర్జీలు 118 సమర్పించారు. ఈ ప్రజావాణీలో వచ్చిన అర్జీలను పరిశీలించి, ఆయా దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని సూచించారు. ఈ ప్రజావాణి లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, డి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article