ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజావాణికి 118 దరఖాస్తులు కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణి లో అర్జీలను సమర్పించడం జరిగిందని, అట్టి దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యలు, రైతు భరోసా, గ్రామ సమస్యలు, ఇతర...