25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

దండు శేఖర్ పై దాడి వెనుక కాంగ్రెస్ శ్రేణుల హస్తం

Must read

📰 Generate e-Paper Clip

  • కేసులో ఏ నాయకుడు ఉన్న పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టాలి
  • 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పనులపై పిసిసి అధ్యక్షుడు బహిరంగ చర్చకు రెడీనా..?
  • ఎక్కడైనా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రజలు చెప్తే అక్కడే రాజీనామా చేస్తా
  • మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : దండు శేఖర్ పై దాడి వెనుక కాంగ్రెస్ శ్రేణుల హస్తం  ఉందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ భర్త సీనియర్ నాయకుడు దండు శేఖర్ పై సోమవారం జరిగిన దాడి బాధాకరమని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దండు శేఖర్ మీద వ్యక్తిగతంగా వరుసగా ఆయన కుటుంబంలో ఆయన తల్లితో పాటు ఆయన భార్య కూడా మేయర్గా పనిచేస్తూ రాజకీయంగా ఎదుగుతున్నాడని ఓరువలేక దాడి చేశారని అన్నారు.  లేనిపోని ఆరోపణలను కాంగ్రెస్ 12 సంవత్సరాలుగా పనిచేసిన ఆయనపై దాడికి దిగాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అసలు ఈ దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని తమకు అనుమానం ఉందని, ఆయనపై దాడి నాయకుడిపై జిల్లా పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి విచారణ చేపట్టాలని, దాడి కి పాల్పడ్డ వ్యక్తి వెనకాల ఉన్న వారెవరినో కూడా గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.

10 నెలలు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులపై పిసిసి అధ్యక్షుడు మహేష్ బహిరంగ చర్చకు సిద్ధమా..

ఏ ఒక్కరూ ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్థలాలు అందుతున్నాయని చెప్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు ఎలాంటి ప్రభుత్వం ఫలాలు అందలేవని విమర్శించారు. కేవలం రిబ్బన్ కటింగ్ లు హడావిడి చేయడం తప్ప కాంగ్రెస్ నేతలకు మరోటి లేదన్నారు. ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా సరే సెంటర్లో నిలబడి రైతులకు రైతుబంధు రుణమాఫీ, మహిళలకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అనేదిచెప్తే నేను కూడా అదే గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నగర అధ్యక్షుడు శిర్ప రాజు, ఎనుగందుల మురళి, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article