26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పథకం ప్రకారంమే మేయర్ భర్తపై హత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

  • దాడి చేసిన రసూల్ అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పథకం ప్రకారం మేయర్ భర్త  దండు శేఖర్ పై సోమవారం దాడి చేసి హత్యాయత్నం చేసిన రసూల్ ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ రాజా వెంకట రెడ్డి తెలిపారు. దండు శేఖర్ భార్య నగర  మేయర్ నీతూ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రసూల్ ను అరెస్టు  చేసినట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ రసూల్ నాగారంలో నివాసం ఉంటున్నాడు. వాళ్ల అమ్మపేరు మీద 2005సవత్సరంలో నాగారంలోని 80వ క్వార్టర్స్లో 75గజాలకు సంబంధించి రెండు ఫ్లాట్లు ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది. ఒక ఫ్లాట్ లో చిన్నగా ఇల్లు కట్టి వాళ్ల అమ్మ, అక్క నివాసం ఉంటున్నారు. మరోక ఫ్లాట్ విషయంలో సుమారు మూడు సంవత్సరాల నుంచి బాధితుడు, బాధితుడి ఫాలోవర్స్ గోపాల్, తిరుపతి తో ఫ్లాట్ విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ విషయంలో దాదాపు సంవత్సరం క్రితం నిందితుడు బాధితుడి ఆఫీస్ కు వెళ్లి ఫ్లాట్ విషయం సెటిల్ చేయమని అడుగగా సెటిల్ కాలేదు. ఇదే విషయం గురించి నిందితుడు చాలాసార్లు బాధితుడు, గోపాల్, తిరుపతితో ఫ్లాట్ విషయంలో మాట్లాడి తాను ఇల్లు కట్టుకుంటానని ఫ్లాట్ విషయంలో అడ్డు రావద్దని చెప్పుకున్న కూడా గోపాల్, తిరుపతి  అలాగే బాధితుడు ఫ్లాట్ విషయంలో సహాయం చేయకుండా బెదిరించారు. ఇదే విషయంలో నాగారం పోలీస్ స్టేషన్ లో 2021లో నిందితుడు తిరుపతి, ఇతరులపై కేసు నమోద చేశాడు. ఇదే విషయంలో నిందితుడు మానసికంగా కుంగిపోయి ఎలాగైనా గోపాల్,బాధితులను చంపితే ఫ్లాటు విషయంలో అడ్డురారని భావించి చంపాలన్న ఉద్దేశ్యంతోనే సోమవారం తన భార్య పిల్లలతో నిందితుడు గోపాలు, శేఖర్లను చంపేస్తానని చెప్పి వారిని వాళ్ల అమ్మ ఇంటికి పంపేశాడు. సాయంత్రం 5.30గంటల సమయంలో నిందితుడు గోపాల్ మీద దాడి చేయడానికి ప్రయత్నించగా, గోపాల్ దొరకకపోవడంతో బాధితుడు శేఖర్ మున్సిపల్ ఆఫీసర్లు ఇద్దరితో సీసీ రోడ్ విషయం లోపల ఇన్స్ పెక్షన్ చేస్తుండగా అది గమనించిన నిందితుడు బాధితుని వద్దకు వెళ్లి నా ఫ్లాట్ కబ్జా చేస్తారా అని బాధితుడిని చేతితో కొట్టి కిందపడేసి కాళ్లతో తన్నిఆటోలో ఉన్న సుత్తి తీసుకుని బాధితుని కణతపై బలంగా కొట్టగా రక్తపు గాయం అయింది. ఈ సంఘటన అంతా కూడా తన ఫోన్లో వెల్డింగ్ అహ్మద్ అను వ్యక్తి సహాయంతో చిత్రీకరించి ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని మంగళవారం విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టకుని కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్, నేరం చేయడానికి ఉపయోగించిన సుత్తి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నాగారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ.గంగాధర్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

More articles

Latest article