భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సహకారంతో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమ్ గల్ పట్టణం నుండి లింబాద్రి గుట్ట వరకు 5 కె రన్ ను గురువారం ఉదయం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పట్టణంలో నిర్వహించిన ఈ 5K రన్ లో 105 మంది యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇందులో భాగంగా, లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించి మత్తు పదార్థాల వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించారు. అనంతరం సహస్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవేర్నస్ ప్రోగ్రాం లో స్కూల్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎం ఈ ఓ స్వామి , డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్-సుధర్శన్, సీ డీ పీ ఓ స్వప్నలత , పీ హెచ్ సీ డా. అజయ్ , ఎక్సైజ్ సీ ఐ శ్రీ వేణు మాధవ్ లు హాజరై మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య పరిణామాల గురించి విద్యార్థులకు విస్తృతంగా వివరించి అవగాహన కలిగించారు.ఎక్కడైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు, అమ్ముతున్నట్లు తెలిసిన వెంటనే 1908 కు కాల్ చేయాలని తెలిపారు. కాల్ చేసి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గొప్యంగా ఉంచడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో బాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ ఎస్.ఐ శ్రీ జి. మహేష్ , ఐ సీ డీ యస్ బృందం, ఉపాధ్యాయ వర్గం, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

