28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వారంలో రోజుల్లో 230 డ్రంకన్ డ్రైవ్ కేసులు 

Must read

📰 Generate e-Paper Clip

 

.  .  .  21,60,000 జరిమానా విధించిన కోర్టులు 

 

. . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

జిల్లా వ్యాప్తంగా గడిచిన వారంలో రోజుల్లో 230 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 9 నుండి 14వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 230 కేసుల నమోదు చేశారు వీరిని  సంబంధిత కోర్టులలో హాజరుపరచగా రూ :21,60,000 జరిమానా విధించడం జరిగిందని సీపీ తెలిపారు. వీరిలో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరన్నారు.

 

 

More articles

Latest article